డెంగ్యూతో వ్యక్తి మృతి | Man dies of Dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో వ్యక్తి మృతి

Aug 31 2015 3:52 PM | Updated on Sep 3 2017 8:29 AM

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో సోమవారం డెంగ్యూ జ్వరంతో అలవాల నరసింహారావు(40) అనే వ్యక్తి మృతిచెందాడు.

ఖమ్మం (తల్లాడ) : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో సోమవారం డెంగ్యూ జ్వరంతో అలవాల నరసింహారావు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో నరసింహారావు ఐదు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకిందని తేల్చారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో బతికే అవకాశాలు తక్కువని వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పడంతో సోమవారం ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే నరసింహారావు మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement