రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి | Man dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి

Sep 19 2015 4:37 PM | Updated on Oct 9 2018 5:43 PM

నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామం వద్ద బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని దశరథ్(64)గా గుర్తించారు.

భువనగిరి అర్బన్ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామం వద్ద బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని దశరథ్(64)గా గుర్తించారు. బైక్‌పై దశరథ్ భువనగిరి నుంచి అనంతారం వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో దశరథ్ బైక్ డివైడర్‌ను ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement