ట్రాక్టర్ నేర్చుకోవడానికి వెళ్లిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.
కుంటాల (ఆదిలాబాద్ జిల్లా) : ట్రాక్టర్ నేర్చుకోవడానికి వెళ్లిన ఒక యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం తురాటి గ్రామ శివారులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దిలావర్‌పూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన దర్శనం శ్రీను(20) గత కొంతకాలంగా ట్రాక్టర్ నేర్చుకునేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.