అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | man died with financial crises in adilabad distiricft | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Feb 10 2015 11:05 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికంగా ఉండే వామన్‌పల్లి ముత్యం(28) అనే వ్యక్తి ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేకే  ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

స్థానికుల సమాచారం అందించడంతో కుంతాల పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(కుంతాల)

Advertisement
 
Advertisement
Advertisement