ఫోన్‌ రీచార్జ్‌ చేయించుకొస్తానని వెళ్లి.. | Man dead body found in keesara lake | Sakshi
Sakshi News home page

ఫోన్‌ రీచార్జ్‌ చేయించుకొస్తానని వెళ్లి..

Nov 23 2017 10:26 AM | Updated on Nov 23 2017 10:33 AM

కీసర: ఫోన్‌ రీచార్జ్‌ చేయించుకొస్తానని వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహమై తేలాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్‌ జిల్లా కీసర మండల కేంద్రంలో జరిగింది. పొలగోని రమేష్ గౌడ్ (28) కీసర వాసి. ఫోన్ రీఛార్జ్‌ చేయించుకుని వస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. అయితే కీసర గుట్టకు వెళ్లే మార్గంలో చెరువు వద్ద అతని బైక్ ఉంది. చెప్పులు, దుస్తులు కనిపించాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాన్ని చెరువు లోంచి బయటికి తీయించారు. యాదాద్రి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement