breaking news
Phone recharge
-
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
తక్కువ రీచార్జ్‌తో ఉచితంగా ఓటీటీలు
వెబ్ సిరీస్‌ల నుండి సినిమాల వరకు అన్నింటినీ చూడటానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి ఎంపికగా మారాయి. అయితే వీటిని వీక్షించాలంటే ప్రత్యేక సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మొబైల్‌కి రీఛార్జ్ చేసుకుంటే చాలు కొన్ని ఓటీటీలను ఉచితంగా చూసేయచ్చు.దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటి ఖర్చు కూడా చాలా తక్కువే. రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంపిక చేసిన ప్లాన్లతో మీరు ఈ కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.రూ. 448 ప్లాన్జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో భాగమైన ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఇందులో సోనీలివ్, జీ5 వంటి డజను ఓటీటీ సేవలు ఉన్నాయి. అంతే కాకుండా జియో యాప్‌లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.రూ. 175 ప్లాన్ఇది జియోలో చౌకైన డేటా ప్లాన్. 28 రోజుల చెల్లుబాటుతో 10జీబీ అదనపు డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఓటీటీల విషయానికి వస్తే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా ఆనందించవచ్చు.రూ.329 ప్లాన్కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టంగా ఉంటుంది. యాప్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రకటనలు చికాకు పెడతాయి. రూ. 329 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుసుకుంటే ప్రకటన రహితంగా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. దీంతో జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. -
ఫోన్ రీచార్జ్ చేయించుకొస్తానని వెళ్లి..
కీసర: ఫోన్ రీచార్జ్ చేయించుకొస్తానని వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహమై తేలాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో జరిగింది. పొలగోని రమేష్ గౌడ్ (28) కీసర వాసి. ఫోన్ రీఛార్జ్ చేయించుకుని వస్తానని వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. అయితే కీసర గుట్టకు వెళ్లే మార్గంలో చెరువు వద్ద అతని బైక్ ఉంది. చెప్పులు, దుస్తులు కనిపించాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాన్ని చెరువు లోంచి బయటికి తీయించారు. యాదాద్రి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అడవిలో తప్పిపోయాం..కాస్త రీచార్జ్ చేయరూ..
హైదరాబాద్ : ఫోన్ రీచార్జీల కోసం ఓవ్యక్తి సరికొత్త వక్రమార్గం కనుగొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వనస్థలిపురానికి చెందిన వెంకటస్వామి తనఫోనులో బాలెన్స్ అయిపోయినప్పుడుల్లా ఏదో ఒక నెంబరుకు ఫోన్ చేసేవాడు. విహార యాత్రకు వచ్చిన తన కుటుంబం కన్యాకుమారి అటవీ ప్రాంతంలో తప్పిపోయిందని చెప్పేవాడు. ఆపదలో ఉన్నామని రీచార్జీ చేయమని కోరేవాడు. అతగాడి మాయమాటలు నమ్మి చాలామంది రీచార్జులు చేశారు. ఇలా ఆరునెలల్లో 527 మందిని మోసం చేశాడు. దీనిపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వనస్థలిపురంలో ఎస్ఓటీ పోలీసులు వెంకట స్వామిని అరెస్ట్ చేశారు. గతంలోను ఇలాంటి కేసులో ఇతగాడు జైలుకి వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్వీటర్ బ్యాంకింగ్ చేస్తున్నారా?!
డబ్బులు పంపొచ్చు.. ఫోన్ రీచార్జ్ చేసుకోవచ్చు లావాదేవీలు సహా దగ్గరిలోని బ్రాంచ్, ఏటీఎం వివరాలు పొందొచ్చు ట్రాన్సాక్షన్లు జరిగేది బ్యాంక్ సర్వర్లోనే.. భద్రతకు ఢోకా లేదు హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌గా ప్రాచుర్యంలోకి.. ఆర్థిక సేవలకు ఓటీపీ తప్పనిసరి ట్వీటర్ అంటే తెలియని వారెవరు చెప్పండి!. ఏదైనా అంశంపై అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలంటే చాలామంది వాడేది దీన్నే. అందుకోసం వాళ్లు చేసిన ట్వీట్‌ను... మరింతమందికి వేరొకరు రీట్వీట్ చేయటం కూడా జరిగేదిక్కడే. ఇక లైక్లూ... కామెంట్లు కామన్. ట్వీటర్ ద్వారా మనకు నచ్చిన వ్యక్తుల్ని, సంస్థల్ని అనుసరిస్తూ ఉండొచ్చు కూడా!!. అంటే వారిచ్చే అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... ట్వీటర్‌తో బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు. దీన్నే ‘హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్’గా పిలుస్తున్నారు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవలు ఇలా పొందొచ్చు.. హ్యాష్‌ట్యాగ్/ట్వీటర్ బ్యాంకింగ్ సేవలను ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ వంటి బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను పొందాలంటే తొలిగా మనకు ఒక ట్వీటర్ అకౌంట్ ఉండాలి. దీన్నే ట్వీటర్ హ్యాండిల్గా పిలుస్తారు. అలాగే బ్యాంక్ ఖాతా కూడా కావాలి. తర్వాత మనకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉందో.. ఆ బ్యాంకును ట్వీటర్లో ఫాలో అవ్వాలి. ఉదాహరణకు మనకు యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉంటే.. ట్వీటర్లో @AxisBankSupport అనే అకౌంట్‌ను అనుసరించాలి. అదే ఎస్బీఐ అనుకుంటే.. @TheOfficialSBI ఆఐ అనే ట్వీటర్ అకౌంట్‌ను ఫాలో అవ్వాలి. తర్వాత బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు #regOTP అని టైప్ చేసి, దీనికి బ్యాంక్ ఖాతా సంఖ్య లేదా కస్టమర్ ఐడీ వంటి వాటిని చేర్చి డైరెక్ట్ మెసేజ్ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు బ్యాంకు నుంచి ఓటీపీ వస్తుంది. తర్వాత #SBIreg అని టైప్ చేసి స్పేస్ ఇచి ఓటీపీ నెంబర్ టైప్ చేసి మళ్లీ బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు మేసేజ్ పంపాలి. అప్పటి నుంచి మీరు ఈ సేవలను పొందొచ్చు. ఉదాహ రణకు మీరు ఎస్బీఐ ఖాతాదారుడు అయితే అప్పుడు మీరు బ్యాంక్ ట్వీటర్ అకౌంట్‌కి #Sఆఐట్ఛజ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ ఖాతా నెంబర్‌ను రాసి డైరెక్ట్ మెసేజ్ పంపాలి. అప్పుడు మీ రిజిస్టర్ బ్యాంక్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. అప్పుడు#regOTP అని స్పేస్ ఇచ్చి ఓటీపీ నెంబర్ టైప్ చేసి మళ్లీ బ్యాంక్ ట్వీటర్ అకౌంట్‌కి మెసేజ్ పంపాలి. ఈవిధంగా మీరు ట్వీటర్ బ్యాకింగ్ సేవలు పొందొచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే... బ్యాంకు ట్వీటర్ అకౌంట్‌కు మెసేజ్ చేయడం ద్వారా నాన్S–ఫైనాన్షియల్ సేవలను వెంటనే పొందొచ్చు. అంటే #Bal, # Txn, #STMT వంటి మెసేజ్‌లు పంపడం ద్వారా బ్యాలెన్స్ వివరాలు, చివరి 3 లావాదేవీలు, గత 3 నెలల ట్రాన్సాక్షన్ల వివరాలను పొందొచ్చు. కాగా ఫైనాన్షియల్ సేవలకు ఓటీపీ తప్పనిసరి. ఉదాహరణకు మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయి మొబైల్ ఫోన్‌ను రీచార్జ్ చేసుకోవాలని భావిస్తే.. @AxisBankSupportMýS$ #sendOTP అని మెసేజ్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ సాయంతో బ్యాంకు రీచార్జ్‌కు ఎలాంటి హ్యాష్‌ట్యాగ్‌ను ఏర్పాటు చేసిందో అదే ఫార్మాట్లో బ్యాంకుకు ఇంకొక మెసేజ్æ పంపాలి. ఎలాంటి సేవలు లభిస్తాయంటే.. ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ ద్వారా ఫైనాన్షియల్తో పాటు నాన్–ఫైనాన్షియల్ సేవలు కూడా పొందొచ్చు. ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల రీచార్జ్, డీటీహెచ్ బిల్లుల చెల్లింపు, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లుల చెల్లింపు, మనీ ట్రాన్స్ఫర్ వంటివన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కిందకు వస్తాయి. అదే నాన్–ఫైనాన్షియల్ సేవల కింద బ్యాలెన్స్ తెలుసుకోవటం, అకౌంట్ స్టేట్మెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, గత లావాదేవీల సమాచారం తెలుసుకోవడం, దగ్గరిలోని బ్రాంచ్/ ఏటీఎం వివరాలు పొందటం వంటి సేవలు కూడా పొందొచ్చు. మనం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అయితే ట్వీటర్ ద్వారా స్నేహితులకు డబ్బులు కూడా పంపొచ్చు. ప్లస్‌లు.. మైనస్‌లు.. ►ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో హ్యాష్‌ట్యాగ్ బ్యాకింగ్ సేవలను బ్యాంకింగ్ కార్యకలాపాలకు మారొక రూపంగా భావించాలి. బ్యాంకుకు డైరెక్ట్ మేసేజ్ పంపడమనేది చాలా మంచి విషయం. మనం పంపే మెసేజ్‌లను బ్యాంకులు మాత్రమే చూస్తాయి. ఎవరికీ కనిపించవు. అదే ట్వీట్స్ అయితే ఇతరులు కూడా చూస్తారు. ► ట్వీటర్ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకోవాలంటే.. పెద్ద హ్యాష్‌ట్యాగ్‌లతో మేసేజ్‌లు పంపాలి. వీటిని గుర్తు పెట్టుకోవడం కష్టం. ► ట్వీటర్ మాధ్యమంగా నిర్వహించే లావాదేవీలకు పరిమితులు కూడా ఉంటాయి. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కస్టమర్ కనీసం రూ.200 నుంచి రూ.5,000 వరకు మాత్రమే డీటీహెచ్ రీచార్జ్ చేసుకోగలడు. ► అదే కొటక్ బ్యాంక్ కస్టమర్ అయితే ట్వీటర్ ద్వారా నెలకు పది మొబైల్ రీచార్జ్‌లను, ఐదు డీటీహెచ్ రీచార్జ్‌లను మాత్రమే చేసుకోవచ్చు. ► ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రూ.5,000 వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోగలడు. ఇక రోజుకు గరిష్టంగా రూ.10,000 ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ సురక్షితమేనా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాదిరిగా కాకుండా సామాజిక మాధ్యమమైన ట్వీటర్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడం సురక్షితం కాదని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌లో ట్వీటర్ అనేది ఒక అనుసంధానకర్త మాత్రమే. ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనైనా ఓటీపీ ఆధారంగానే జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ‘ట్వీటర్/హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్‌లో జరిగే అన్ని లావాదేవీలు ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్లోనే జరుగుతాయి. ఇవ్వన్నీ బ్యాంక్ ఫైర్‌వాల్ పరిధిలోనే ఉంటాయి. హ్యాష్‌ట్యాగ్ బ్యాంకింగ్ కూడా సురక్షితమైనదే’ అని ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ చానల్స్ హెడ్ అబోంటి బెనర్జీ వివరించారు.