వ్యక్తి బలవన్మరణం | Man commits suicide | Sakshi
Sakshi News home page

వ్యక్తి బలవన్మరణం

Jan 14 2016 4:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

నవాబుపేట (రంగారెడ్డి) : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన మరాటి నర్సింహులు(35) కుటుంబంతోపాటు హైదరాబాద్‌లో ఉంటూ పెయింటింగ్ పని చేసేవాడు. నర్సింహులు గత కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. దానికి తోడు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవపడి స్వగ్రామం గేట్‌వనంపల్లికి వెళ్లాడు.

బుధవారం మధ్యాహ్నం నుంచి మద్యం మత్తులోనే ఉన్న నర్సింహులు రాత్రి 8 గంటల ప్రాంతంలో విష గుళికలు మింగి ఇంట్లో తలుపు వేసుకుని పడుకున్నాడు. ఎంత పిలిచినా సమాధానం ఇవ్వకపోవటంతో తండ్రి కిష్టయ్య రాత్రి తలుపులు పగులగొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. నర్సింహులుకు భార్య పుష్పలత, కుమారుడు మనీష్(6), అమ్ములు(4) ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement