కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి | Maloth Kavitha Speech In Dornakal At Warangal | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి

Aug 27 2019 11:06 AM | Updated on Aug 27 2019 11:11 AM

Maloth Kavitha Speech In Dornakal At Warangal - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ కవిత

సాక్షి, మరిపెడ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని ఎంపీ మాలోతు కవిత  అన్నారు. మండల కేంద్రంలోని భార్గవ్‌ఫంక్షన్‌ హాలులో సోమవారం డోర్నకల్‌ నియోజక వర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని.. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించడమే కాకుండా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కలుగుతుందన్నారు. కేంద్రం తమ వద్ద ఉన్న విశిష్ట అధికారాలను ఉపయోగించి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. తెలంగాణ  ప్రాజెక్టులకు కేంద్రం సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మెన్‌ గుడిపుడి నవీన్, టీఆర్‌ఎస్‌ నాయకులు రామసహయం రంగారెడ్డి,  డీఎస్‌ రవిచంద్ర, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement