పిచ్చి కుక్క స్వైర విహారం | mad dog attack ten injured in nakrekal | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్క స్వైర విహారం

Apr 20 2016 9:58 AM | Updated on Sep 3 2017 10:21 PM

నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది.

నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది. బుధవారం ఉదయం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను నల్గొడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిరేకల్... ఆ సమీపం ప్రాంతంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనిపై స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన.. వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement