ఆదిలాబాద్ జిల్లా నెన్నెలలో ఓ ప్రేమ జంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా నెన్నెలలో ఓ ప్రేమ జంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెన్నెల గ్రామానికి చెందిన స్రవంతి, తిరుపతి చాలాకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలకు ప్రేమ వ్యవహరాన్ని తెలియజేశారు. అంతే ఆ ప్రేమికులపై ఇరు కుటుంబాల పెద్దలు కారాలు మిరియాలు నూరారు. దాంతో 10 రోజుల నుంచి ఆ ప్రేమ జంట ఆచూకీ లేకుండా పోయారు.
ఇంటి నుంచి పరారైయ్యారని ఇరు కుటుంబాల వారు భావించారు. అయితే శనివారం ఆ ప్రేమ జంట నూతిలో శవాలై తేలడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుందని బంధువులు భావిస్తున్నారు. ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమ జంట మృతదేహలను స్వాధ్వీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.