ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు! | Loved people commit to suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు!

Jun 10 2017 4:18 AM | Updated on Nov 6 2018 8:08 PM

ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు! - Sakshi

ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు!

ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు గాయం చేశాయి. రెండేళ్ల ప్రేమ వ్యవహారం..ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ప్రియుడు..

- ఇండియాలో ప్రియురాలు.. సౌదీలో ప్రియుడు ఆత్మహత్య
- రెండు నెలలకు ప్రియుడి మృతదేహం రాక..
 
కోరుట్ల/మేడిపల్లి: ప్రేమ గులాబీకి గల్ఫ్‌ ముళ్లు గాయం చేశాయి. రెండేళ్ల ప్రేమ వ్యవహారం..ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ప్రియుడు..అక్కడ కలివెల్లి కావడంతో సకాలంలో తిరిగిరావడానికి వీలుకాలేదు. అతని రాకకు ఎదురుచూస్తూ పెద్దలు చూస్తున్న పెళ్లి సంబంధాలను కాదనలేక.. ప్రేమికుడిని వదులు కోలేక కుమిలిపోయిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసి సౌదీలో ఉన్న ప్రి యుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకు న్నాడు. మార్చిలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండ లంలో జరిగిన హృదయవిదారక ప్రేమగాథ ఇదీ. 2 నెలల అనంతరం శుక్రవారం సౌదీలో ఆత్మహత్య చేసు కున్న ప్రియుడి మృతదేహం స్వగ్రామానికి చేరడం తో ఇరు కుటుంబాల్లో కన్నీరు కట్టలు తెంచుకుంది. 
 
ప్రేమను వదులుకోలేక..
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లకు చెందిన కుంట రాజశేఖర్‌(25), అదే మండలంలోని కట్లకుంట్లకు చెందిన పొన్నం వెన్నెల  ప్రేమించుకుం టున్నారు. ఒకే సామాజిక వర్గా నికి చెందిన వారు కావడంతో పెళ్లికి అభ్యంతరాలు రావనుకు న్నారు. వెన్నెల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు రావడం తో వీరి ప్రేమకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2016లో  రాజశేఖర్‌ ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాడు. ఏడాదిన్నరలో తిరిగివస్తానని పెళ్లి చేసుకుం దామని వెన్నెలతో చెప్పాడు. కొన్నాళ్లు అక్కడ కంపెనీలో పనిచేసి మంచి సంపాదన కోసం కలివెల్లి అయి పని దొరికిన చోట పనిచేస్తున్నాడు.  కొన్నాళ్లకు వెన్నెల ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు తాము సూచించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొ చ్చారు. ఈ విషయాన్ని రాజశేఖర్‌కు తెలిపింది.

తాను తిరిగివస్తానని చెప్పిన రాజశేఖర్‌ ఇండియా కు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. వీసా దొరకడంలో ఇబ్బందులు ఎదుర య్యాయి. సౌదీలో పోలీసులకు పట్టుబడి జైలులో ఉండి తిరిగి రావాల్సి న దుస్థితి తలెత్తింది.  దీంతో స్వదేశానికి తిరిగి రావడంలో ఆలస్యం జరిగింది.  వెన్నెలకు పెద్దల నుంచి ఒత్తిడి పెరగ డంతో గత మార్చి 25న ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఈ విషయం తెలిసి కలత చెందిన రాజశేఖర్‌.. మార్చి 28న సౌదీలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కాగా, 2 నెలల తర్వాత శుక్రవారం రాత్రి రాజశేఖర్‌ మృతదేహం పోరుమల్లకు చేరుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement