అంబులెన్స్ను ఢీకొన్న లారీ, రోగి మృతి | Lorry hits ambulance, patient died | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ను ఢీకొన్న లారీ, రోగి మృతి

Oct 18 2014 8:31 AM | Updated on Sep 2 2017 3:03 PM

: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లిలో శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న అంబులెన్స్ను వెనుక నుంచి లారీ ఢీకొంది.  దాంతో అంబులెన్స్లో ఉన్న పేషెంట్ రామ సుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనారోగ్యంగా ఉన్న రామ సుబ్బారెడ్డిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జిల్లాలోని ధన్వాడ మండలం పస్పులగేట్ వద్ద ఓ లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement