పేలిన కంటైనర్: భారీగా ట్రాఫిక్ జామ్ | Lorry container blast in Bellampalli, adilabad district | Sakshi
Sakshi News home page

పేలిన కంటైనర్: భారీగా ట్రాఫిక్ జామ్

Nov 25 2014 11:41 AM | Updated on Apr 3 2019 3:52 PM

పేలిన కంటైనర్: భారీగా ట్రాఫిక్ జామ్ - Sakshi

పేలిన కంటైనర్: భారీగా ట్రాఫిక్ జామ్

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బొయిపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ప్లోజివ్ మెటిరియల్ తీసుకువెళ్తున్న కంటైనర్లో పేలుడు సంభవించింది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం బొయిపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ప్లోజివ్ మెటిరియల్ తీసుకువెళ్తున్న కంటైనర్లో పేలుడు సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రహదారిపై దాదాపు 10 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది..ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే కంటైనర్లో పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎక్స్ప్లోజివ్ మెటిరియల్ను కంటైనర్లో సింగరేణికి సరఫరా చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement