నామినేటెడ్‌ పదవా రాజీనామా చేయడానికి.. | Lok Sabha elections People Say Good Sense Says Uttam Kumar | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవా రాజీనామా చేయడానికి..

Apr 3 2019 4:13 AM | Updated on Sep 19 2019 8:44 PM

Lok Sabha elections People Say Good Sense Says Uttam Kumar - Sakshi

చింతలపాలెం (హుజూర్‌నగర్‌): ‘నా ఎమ్మెల్యే పదవి నామినేటెడ్‌ పదవి కాదు. వారు రాజీనామా చేయమనగానే చేయడానికి’ అని టీపీసీసీ చీఫ్, నల్లగొండ లోక్‌సభ స్థానం ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యే పదవి గురించి అడగడానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ఎవరని ప్రశ్నించారు. ఇదే జగదీశ్‌రెడ్డి తన మీద పోటీచేసి 30 వేల ఓట్లతో ఓడిపోయారని గుర్తు చేశారు. పలువురు నేతలు పార్టీ మారుతున్న విషయాన్ని ఉత్తమ్‌ వద్ద ప్రస్తావించగా.. అమ్ము డు పోయే వారికి కొనుక్కునే వారికి ఇద్దరికీ సిగ్గు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరని అన్నారు. కేసీఆర్‌ తన స్వార్థం, అధికార దాహం కోసం రాష్ట్రాన్ని, రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. అలాంటి వారికి ప్రజ లే తగిన బుద్ధి చెబుతారన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement