దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ వేగంగా అమలవుతోంది.
పార్టీ మరింత బలోపేతానికి కార్యాచరణ
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీలపై కసరత్తు
త్వరలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై నిర్ణయం
జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా నాయుడు ప్రకాశ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ వేగంగా అమలవుతోంది. ఇప్పటికే పేద, బడు గు, బలహీన, గిరిజన ప్రజల తరపున జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించిన ఆ పార్ట్టీ ప్రజలకు మరింత చే రువవుతోంది. ‘గడప గడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ నినాదంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దీటైన అభ్యర్థులను రంగంలో కి దింపేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే జిల్లాకు చెందిన సీని యర్ నాయకులు, నియోజకవర్గాల సమన్వయ కర్తలు, సీజీసీ సభ్యులు, ఇతర నాయకులతో సమావేశమయ్యా రు. పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా జుక్కల్ నియోజకవర్గ సమన్వయకర్త నాయుడు ప్రకాశ్‌ను నియమిస్తూ అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీ చే సింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఆయనను నియమించింది. నాయుడు ప్రకాశ్ నందిపేట జడ్‌పీటీసీ సభ్యునిగా పని చేశారు.
నాయుడు ప్రకాశ్‌కు జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా రాష్ర్ట విభజన బిల్లు ఆమోదం అనంతరం ఖమ్మం జిల్లాలో ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు భారీ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ వైఎస్‌ఆర్ సీపీ రోజు రోజుకు బలోపేతం అవుతుండగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పార్టీవైపు చూస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికపైనా పార్టీ కసరత్తు చేస్తోంది.