
సాక్షి, నల్గొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత అడవిపందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుంది. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మత్తు మందు ప్రయోగించి చిరుతను బంధించారు. అనంతరం జూ కి తరలించారు. చిరుత ప్రత్యక్షంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో చిరుత కదలికలపై సమాచారమిచ్చినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.