
3 రోజులు తెలంగాణ శాసనమండలి సమావేశాలు
మూడు రోజులపాటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్: మూడు రోజులపాటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ శాసనమండలి బీఏసీ సమావేశం ముగిసింది. గవర్నర్ ప్రసంగానికి రేపు, ఎల్లుండి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 14న పోలవరం, అమరవీరులు, హిమాచల్‌ప్రదేశ్ ఘటనపై తీర్మానాలు చేస్తారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 14 వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. రేపు, ఎల్లుండి ఉదయం 10 నుంచి సాయంత్రం వరకూ గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 14న అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం తెలుపుతారు.