‘పెట్టుబడి’ కౌలురైతులకే దక్కాలి 

Lease Farmers Deserve To 'Investment'  - Sakshi

అందుకు భూ యజమానులు సహకరించాలి

ఇప్పటికిప్పుడు కౌలు రైతులను గుర్తించడం కష్టం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు

తిరుమలాయపాలెం : రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వారి ఇబ్బందులను తొలగించేందుకు నేరుగా ఉపయోగపడేలా రూప కల్పన చేసిన పథకం ‘రైతుబంధు’ అని, భూమిని నమ్ముకుని కష్టపడుతున్న కౌలు రైతులకు పెట్టు బడి సహాయం దక్కేలా భూ యజమానులు సహకరించాలని రాష్ట్రరోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తెట్టెలపాడులో రైతుబంధు చెక్కులను బుధవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కరువు కాటకాలతో చితికిపోయిన రైతులను ఆదుకునేందుకే కేసీఆర్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఇప్పటికిప్పుడు కౌలు రైతులను గుర్తించడం కష్టమని, భూ యజమానులు ఎవరికి కౌలుకు ఇస్తారో తెలియదని, అందుకే భూమి ఉన్నవారికే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కౌలు రైతులు సంఘటితంగా ఉంటే భూ యజమానులు దిగిరాక తప్పదన్నారు.

గ్రామంలోని కాలనీలకు సీసీరోడ్లు, మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెట్టెలపాడు నుంచి గోపాలపురం వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్‌ కృష్ణవేణి, ఎంపీడిఓ వెంకటపతిరాజు, మండల వ్యవసాయాధికారి శరత్‌బాబు, సర్పంచ్‌ ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పుసులూరి నరేందర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ మద్దినేని మధు, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్‌ పుసులూరి పుల్లయ్య, జడ్పీ కోఆప్షన్‌ సభ్యు డు జియాఉద్దిన్, గ్రామ సర్పంచ్‌ సోమనబోయిన లింగయ్య, ఎంపీటిసి ఎల్లమ్మ, సొసైటీ డైరెక్టర్‌ కొండబాల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top