‘సామాజిక స్మగ్లర్లు – కోమటోళ్లు’పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు న్యాయవాది కె.ఎల్.ఎన్.వి.వీరాంజనేయులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
► సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ: ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు – కోమటోళ్లు’పుస్తకాన్ని నిషేధించాలని విన్నవిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది కె.ఎల్.ఎన్.వి.వీరాంజనేయులు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, కంచ ఐలయ్య, çపుస్తక ప్రచురణ సంస్థను పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.