
టెండర్ దాఖలు చేస్తున్న వాహనదారులు
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉమ్మడి జిల్లాలో అదనంగా 51 అద్దె రూపంలో ఆర్టీసీ బస్సు సర్వీసుల ఎంగేజ్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 రూట్లలో అదనంగా 51 హైర్ విత్ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. టెండర్‌దాఖలు గడువు సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ముగిసింది. దీంతో 51 బస్సుల టెండర్లకు దాదాపు 1,800 నుంచి 2వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల అనంతరం లక్కీ డిప్ నిర్వహించాల్సి ఉండగా దరఖాస్తులు ఎక్కువగా రావడంతో వాటి లెక్కింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రి 11 గంటల తర్వాత లక్కీ డిప్ తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారులతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, కార్యాలయం ఆవరణలు కిటకిటలాడాయి.