కురుల కొమురయ్య.. | Kurula Komurayya | Sakshi
Sakshi News home page

కురుల కొమురయ్య..

May 3 2016 4:00 AM | Updated on Aug 21 2018 2:34 PM

కురుల కొమురయ్య.. - Sakshi

కురుల కొమురయ్య..

అతని ఎత్తు 5.9 అడుగులు.. జుత్తు పొడవు 6 అడుగులకు పైనే.. మల్లన్న భక్తుడైన ఇతని పేరు కామల కొమురయ్య.

మెదక్ : అతని ఎత్తు 5.9 అడుగులు.. జుత్తు పొడవు 6 అడుగులకు పైనే.. మల్లన్న భక్తుడైన ఇతని పేరు కామల కొమురయ్య. యాభై ఆరు ఏళ్ల కొమురయ్య 30 ఏళ్లుగా జుత్తు పెంచుతున్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం చిన్నకిష్టాపూర్‌కి చెందిన కొమురయ్య మల్లికార్జునస్వామి భక్తుడు. ముప్పై ఏళ్లుగా ఎన్నో శివాలయాలను సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా ఓదెల మల్లికార్జుస్వామిని దర్శనం చేసుకున్నాడు. నిలువెత్తు జుత్తుతో కనిపించిన ఆయనను భక్తులు ఆసక్తిగా చూశారు.

జుత్తు తీయాలని అప్పుడప్పుడు అనిపించినా ‘కలలో మల్లన్న ప్రత్యక్షమై వద్దురా నాయనా’ అనడంతో జుత్తును అలాగే ఉంచుతున్నానని చెప్పాడు. తనను కలిసిన కొందరు గిన్నిస్‌బుక్‌లో పేరు చేర్చేందుకు ప్రయత్నించగా.. తనకలాంటి కోరికలు లేవని, దేవుడి పేరిట... దేవుడి సన్నిధిలో గడుపడమే ఇష్టమని చెప్పాడు.  
 - ఓదెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement