
కేటీఆర్, రోహిత్ రెడ్డి
కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఓ ఆంధ్ర యువకుడు పాదయాత్ర చేపట్టిన..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ పార్టీయే అధికారం చేపట్టాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని రోహిత్ కుమార్ రెడ్డి అనే ఆంధ్ర యువకుడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యువకుడు చేసిన పనికి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ట్వీటర్ వేదికగా అతనికి ధన్యవాదాలు తెలిపారు. ‘రోహిత్ రెడ్డి నీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. ఏపీకి చెందిన రోహిత్.. కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా విజయవాడ నుంచి పాదయాత్ర చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
Many thanks Rohit Kumar Reddy for your love & solidarity 🙏
— KTR (@KTRTRS) October 8, 2018
Rohit, who’s a native of AP is walking all the way from Vijayawada to Hyderabad garnering support for KCR Garu & TRS #TelanganaWithKCR https://t.co/HuyPxI4IgC
అయితే రోహిత్ రెడ్డి కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు మద్దతుగా మాట్లాడిన వీడియోను శ్రీనివాస్ నారయణ్ అనే నెటిజన్ ట్వీట్ చేయగా దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.