శ్రీనివాస్‌ హత్యపై ఎస్పీ అవాస్తవాలు: కోమటిరెడ్డి | komati reddy venkata reddy commented over srinivas murder | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ హత్యపై ఎస్పీ అవాస్తవాలు: కోమటిరెడ్డి

Jan 30 2018 2:12 AM | Updated on Jan 30 2018 2:12 AM

komati reddy venkata reddy commented over srinivas murder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ కాంగ్రెస్‌ నేత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య విషయమై జిల్లా ఎస్పీ పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిర్చిబండి వివాదమే కారణమని చెబు తున్న పోలీసులు ఇప్పటిదాకా ఆ మిర్చిబండి యజమాని యాదయ్యను విచారించలేదన్నారు.

తన భర్త కనిపిం చట్లేదని లక్ష్మి పోలీసులను కలిసినా స్పందించలేదని, మోహన్‌ అనే వ్యక్తి స్పందించి శ్రీనివాస్‌ శవాన్ని చూపిం చాడని వెల్లడించారు. పోలీసులు మాత్రం దీనికి భిన్నంగా భర్త శవాన్ని లక్ష్మి ముందుగా చూసినట్టుగా అబద్ధం చెప్పా రన్నారు. ఈ హత్య గురించి పోలీసులకు ముందుగానే తెలుసునని, ఇది పథకం ప్రకారం జరిగిందని, దీనిలో సీఎం కేసీఆర్, డీజీపీ, ఎస్పీ పాత్ర ఉందని  ఆరోపించారు. శ్రీనివాస్‌ను చంపేస్తామని 20 రోజుల ముందుగానే బెదిరింపులు వచ్చాయని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను చంపేస్తామంటూ ఎమ్మెల్యే వీరేశం మనుషులు ఫోన్లలో బెదిరిస్తున్నారని, ఆయనను చంప డానికి కుట్ర జరుగుతున్నదన్నారు.

బెదిరింపులు వస్తున్న ఫోన్‌ నంబర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించాల న్నారు. కేసుపై కోర్టులో అప్పీలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌ నేతలను టీఆర్‌ఎస్‌ పార్టీ చంపిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీహెచ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కోదండరాంను, తనను చంపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement