తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి | kishan reddy comments on the trs party | Sakshi
Sakshi News home page

తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి

Sep 4 2014 3:34 AM | Updated on Mar 29 2019 9:00 PM

తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి - Sakshi

తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి

టీఆర్‌ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

సంగారెడ్డి/రామచంద్రాపురం: టీఆర్‌ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, రామచంద్రాపురంలలో బుధవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వంద రోజుల టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేసిందో కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సర్వేల పేరుతో తెలంగాణ ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించారన్నారు. కొత్త సంక్షేమ పథకాలు అమలు కాకపోగా ఉన్న రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తొలగించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటని  కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement