రైతులకు మద్దతు ధర అందించాలి | Kharif Farmers Support Price Provided | Sakshi
Sakshi News home page

రైతులకు మద్దతు ధర అందించాలి

Oct 19 2014 1:56 AM | Updated on Sep 2 2017 3:03 PM

ఖరీఫ్‌లో రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడేది లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశా రు. మంత్రి శనివారం రాష్ట్ర పౌరసరఫరాల

 రాంనగర్ : ఖరీఫ్‌లో రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాజీపడేది లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశా రు. మంత్రి శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథితో కలిసి జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఫిర్యాదులకు, విమర్శలకు తావు లేకుం డా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర విధిగా రైతాంగానికి అందించాలని అధికారులను ఆదేశించారు. అసలే తీవ్ర ఎండలతో వర్షాభావ పరిస్థితులతో కరువుతో ఉన్న రైతులు నష్టపోకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ ప్రాధాన్యమైన పని ధాన్యం కొనుగోలుగా పరిణించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మిల్లర్లకు అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే సాధనాలు, తార్పాలిన్లు ఇతర మౌలిక సౌకర్యాల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా రూ. 6 కోట్ల 47 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పత్తికొనుగోలు కేంద్రాల పరిధిలో ఫైర్ సర్వీసులను అప్రమత్తం చేయాలని సూచించా రు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెను వెంటనే మిల్లుపాయింట్లకు చేర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
 రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ 2014-15 సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో 25 శాతం లెవీ పాలసీతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచిం చారు. ప్రతి జిల్లాలో ఆన్‌లైన్ విధానం ద్వారా చెల్లింపులు జరపాలని, రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి డేటాబేస్ నమోదు చేయాలని కోరారు. కస్టమ్ మిల్లింగ్ చార్జీలను ఈ సీజన్‌లో పెంచే ఆలోచన ప్రభుత్వం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల రారైస్, 10 లక్షల బాయిల్డ్ రైస్ సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి మిల్లర్లకు లక్ష్యం నిర్దారించాలని కోరారు. మిల్లర్లు జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి పర్మిట్లు పొందనసరం లేదని సోనా, సాంబమసూరి ఇతర సూపర్‌ఫైన్ రకాలకు లెవీ విధానం వర్తించదన్నారు. సూపర్‌ఫైన్ రకం ధాన్యం మిల్లర్లు, ట్రేడర్లు రాష్ట్రంలో విక్రయించాలని, ఇతర రాష్ట్రాలకు అనుమతి లేదన్నారు.
 
 జేసి ప్రీతిమీనా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌లో 799000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాగలదని అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 123 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించి ఇప్పుటి వరకు 20 ప్రారంభించినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి నాణ్యత ప్రమాణాల నిర్దారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్న ధాన్యం మిల్లులకు తక్షణమే రవాణా చేయడానికి గాను ట్రాన్స్‌పోర్టు టెండర్లు ఖరారు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 8000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న మార్కెట్‌కు రాగలదని అంచనా వేసి 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పత్తికొనుగోలు కోసం 13 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏపీడీ  సుధాకర్, జేడీఏ నర్సింహారావు, డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌వో వెంకటేశ్వరు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement