ద్వాదశాదిత్యుడు సిద్ధమవుతుండు సిద్ధమవుతుండు  

Khairatabad Ganesh Idol Making In Hyderabad - Sakshi

80 శాతం పూర్తయిన మహాగణపతి తయారీ పనులు

ఈ నెల 27 నాటికి పనులన్నీ పూర్తి 

శిల్పి రాజేంద్రన్‌ నేతృత్వంలో 150 మంది కార్మికులతో శరవేగంగా పనులు

సాక్షి, హైదరాబాద్‌: : 65 ఏళ్ల ఖైరతాబాద్‌ చరిత్రలోనే ఈసారి తయారు చేస్తున్న ద్వాదశాదిత్య మహాగణపతిని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏకంగా 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 12 ముఖాలు, 24 చేతులతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా మూడు నెలల ముందు నుంచే ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులు ప్రారంభిస్తారు. విగ్రహ తయారీలో 150 మంది పని చేస్తారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు ఇప్పటికే 80శాతం పూర్తయ్యాయి. ఈ నెల 27 వరకు పనులన్నీ పూర్తవుతాయి.   

వీరే పాత్రధారులు...
షెడ్డు పనులు: ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్‌ ఆధ్వర్యంలోని 20 మంది బృందం.   
వెల్డింగ్‌ పనులు: మచిలీపట్నంకు చెందిన జి.నాగబాబు ఆధ్వర్యంలోని 20 మంది. 
క్లే వర్క్‌: చెన్నైకి చెందిన గురుమూర్తి ఆధ్వర్యంలోని 25 మంది.  
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌: మహారాష్ట్రకు చెందిన సుభాష్‌ ఆధ్వర్యంలోని 23 మంది.
మోల్డింగ్‌ పనులు: హైదరాబాద్‌కు చెందిన కోఠి ఆధ్వర్యంలోని 22 మంది బృందం.  
ఫినిషింగ్‌ పనులు: బిహార్, బెంగాల్‌కు చెందిన గోపాల్, సంతోష్‌ల ఆధ్వర్యంలోని 15 మంది.  
పెయింటింగ్‌: కాకినాడకు చెందిన భీమేశ్‌ ఆధ్వర్యంలోని 25 మంది బృందం.  

విగ్రహం వివరాలివీ...  
పేరు: ద్వాదశాదిత్య మహాగణపతి  
తలలు 12 
సర్పాలు 12  
చేతులు 24  
24 చేతుల్లో 24 ఆయుధాలు ఉంటాయి. అవి అభయహస్తం, లడ్డూ, శంఖం, చక్రం, గద, పరశు, పాశం, శూలం, అంకుశం, కత్తి, రుద్రాక్షలు, పుష్పశరం, పద్మం, చెరుకుగడ ధనస్సు, బాణం, నాగం, వీణ, దండం, కమండలం, సుల్లా, గ్రంథం, గొడ్డలి, భగ్న దంతం, ధ్వజం.  

సామగ్రి, ఖర్చులు ఇలా..  

  •  సర్వీ కర్రలు 80 టన్నులు, వ్యయం రూ.3 లక్షలు.
  •  షెడ్డు నిర్మాణానికి లేబర్‌ రూ.లక్ష  
  • గోవా తాడు 100 బెండళ్లు, రూ.11 వేలు  
  • స్టీల్‌ 30 టన్నులు, ఖర్చు రూ.20 లక్షలు
  • ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ 45 టన్నులు (మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ ఉచితంగా అందజేసింది)   
  •  కొబ్బరి నార 60 బెండళ్లు, రూ.90 వేలు 
  • గోనె క్లాల్‌ 2వేల మీటర్లు, రూ.60 వేలు 
  • బంకమట్టి 600 బ్యాగులు, రూ.1.25 లక్షలు 
  • ఫ్రెంచ్‌ పాలిస్‌ రూ.11 వేలు  
  • వాటర్‌ పెయింట్స్‌ 120 లీటర్లు, రూ.80 వేలు
  •  వెల్డింగ్, మోల్డింగ్, డిజైన్‌ వర్క్, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, సెక్యూరిటీ ఇతరత్రా లేబర్‌ చార్జీలు రూ.35 లక్షలు  
  • ప్రతిరోజు లేబర్‌కు భోజనం రూ.10 లక్షలు  
  • ట్రాన్స్‌పోర్ట్, ఇతరత్రా ఖర్చులు రూ.3 లక్షలు


1954లో స్వాతంత్ర సమరయోధుడు సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్‌ గణపతి ఎత్తు ఏటా ఒక అడుగు పెరుగుతూ వస్తోంది. సింగరి శంకరయ్య 1994లో మరణించిగా... ఆయన తమ్ముడు సింగరి సుదర్శన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన బావమరిది సందీప్‌రాజ్, కుమారుడు రాజ్‌కుమార్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.  

నమూనాలో మార్పులు..  

  • మహాగణపతి ప్రధాన తలపై మూడు తలలు ఉండేలా తొలుత శిల్పి నమూనా సిద్ధం చేశారు. అయితే తయారీ సమయంలో 12 తలలను సెట్‌ చేసేందుకు ప్రధాన తలపై మూడు తలలకు బదులుగా ఐదు తలలను పెట్టి డిజైన్‌ ఫైనల్‌ చేశారు. దీంతో నమూనాను రెండుసార్లు మార్చారు.  
  • 12 తలలు, 12 సర్పాలు, 24 చేతులతో మహాగణపతిని తయారు చేయాలంటే తప్పనిసరిగా 61 అడుగులు ఉండాలని... ఈ నేపథ్యంలో ఎత్తు పెంచాల్సి వచ్చిందని శిల్పి రాజేంద్రన్‌ తెలిపారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top