మహిళా సంక్షేమానికి సీఎం కృషి | KCR Working For women Welfare | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమానికి సీఎం కృషి

Jul 17 2018 1:58 PM | Updated on Aug 17 2018 2:56 PM

KCR Working For women Welfare - Sakshi

జోగు రామన్న

ఆదిలాబాద్‌రూరల్‌ : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ మహిళలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లబ్ధిదారులకు సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం 32 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్‌ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు నైతం శుక్లాల్, ఖయ్యుం, యూనుస్‌ అక్బానీ, ఎంపీడీవో రాథోడ్‌ రవీందర్, తహసీల్దార్‌ మధుకర్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement