జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి వీలుగా పార్లమెంటులో బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ప్రవేశపెట్టడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి వీలుగా పార్లమెంటులో బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ప్రవేశపెట్టడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం ప్రగతిశీల చర్యగా అభివర్ణించిన సీఎం.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
ఈ బిల్లుకు టీఆర్‌ఎస్ మద్దతు పలుకు తుందని స్పష్టం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేయడంతోపాటు తెలంగాణ తరఫున మద్దతుగా నిలవాలని తమ పార్టీ ఎంపీలను కోరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాదిరిగానే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం వల్ల దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.