తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించ తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను ప్రజలంతా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించ తలపెట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను ప్రజలంతా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. ప్రజలంతా తమ ఇళ్ల వద్దకు వచ్చే అధికారులకు సరైన సమాచారం ఇవ్వాలని ఆయున విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి, ఏ కుటుంబంలోని ఏ వ్యక్తి ఏమి కోరుకుంటున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలియడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.ఈ మేరకు సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
నార్సింగి ఫాంహౌస్‌లో కేసీఆర్: కేసీఆర్ సోవువారం వుధ్యాహ్నం కొందరు సన్నిహితులైన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో ఉన్న ఒక ఫాంహౌస్‌కు వెళ్లారు. వుంగళవారం జరగనున్న సమగ్ర ఇంటింటి సర్వే, సింగపూర్ పర్యటన నేపథ్యంలో వారు పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. వుుఖ్యంగా కేబినెట్ విస్తరణ, మెదక్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఎంపిక, రాష్ట్ర కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం వంటివాటిపై చర్చలు జరిపినట్టు సమాచారం.