ఓటుకు నోటు కేసుపై గవర్నర్తో కేసీఆర్ చర్చ | kcr meets narasimhan, discuss on note for vote case | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కేసుపై గవర్నర్తో కేసీఆర్ చర్చ

Jun 5 2015 3:01 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్భవన్ వెళ్లి నరసింహన్ను కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు విషయం కేసీఆర్ గవర్నర్తో చర్చించినట్టు సమాచారం.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు స్టీఫెన్తో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారని, ఇందుకు సంబంధించి ఆడియో రికార్డులు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement