'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం' | KCR Distribute House Pattas to Beneficiaries | Sakshi
Sakshi News home page

'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం'

Jun 5 2015 1:48 PM | Updated on Aug 14 2018 10:51 AM

'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం' - Sakshi

'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం'

కేసులు ఉండడం వల్లే అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్: కేసులు ఉండడం వల్లే అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించి అందరికీ పట్టాలు ఇస్తామన్నారు. శుక్రవారం మల్కాజ్ గిరిలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేకాట, రేసు క్లబ్బులకు వేల ఎకరాలు కట్టబెట్టారని... పేదలకు ఇళ్లు కడదామంటే స్థలాలు లేవన్నారు.

జంట నగరాల్లో దాదాపు  2 లక్షల మంది అధ్వాన్నంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీయిచ్చారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని పునరుద్ఘాటించారు. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. పేదలకు న్యాయం జరిగినప్పుడే తన జన్మ ధన్యమవుతుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement