ఖమ్మం జిల్లా కుక్కునూర్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కుక్కునూర్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం సచివాలయంలో కేసీఆర్‌ను ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావు, కోరం కనకయ్య కలిశారు. తాటి వెంకటేశ్వర్లుపై జరిగిన దాడిని ఈ సందర్భంగా సీఎం ఖండించారు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)నాయకత్వంలో జైఆంధ్ర నినాదాలు చేస్తూ తనపై దాడి జరిగిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వెంకటేశ్వర్లు కోరారు.