మహిళా సాధికారతకు సహకరించాలి: కవిత

Kavitha on womans day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు సహకరించాలని ఎంపీ కవిత కోరారు. పార్క్‌ హయత్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీడర్‌షిప్‌ సమ్మిట్‌–2018కి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వారసత్వ మహిళా నాయకులను కొందరు ప్రశ్నిస్తున్నారని.. పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలన్నారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా దేశ అధ్యక్షులుగా మహిళలకు అవకాశం రాలేదని అలాంటిది మన దేశంలో ఇందిరా గాంధీ లాంటి వ్యక్తి ప్రధాని అయినా మహిళలు ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్‌ను ప్రారంభించిందని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి వారికి భద్రత మీద భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రముఖ జర్నలిస్ట్‌ సాగరికా ఘోష్‌ మాట్లాడుతూ, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరగాలన్నారు. స్త్రీలు వంటింటికి పరిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని చూడాలని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.   

అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు
ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
సాక్షి, హైదరాబాద్‌: ప్రతి పేద కుటుంబానికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్‌లో జరిగిన ఎల్పీజీ పంపిణీదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిలిండర్ల పంపిణీలో అక్రమాలు సహించబోమని, చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నగదు బదిలీ పథకంతో గ్యాస్‌ సిలిండర్ల అక్రమాలు తగ్గాయని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top