కరీంనగర్‌ గడ్డ మీద కారు హవా | Karimnagar Municipal Corporation Elections Result | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో పత్తా లేని కాం‍గ్రెస్‌

Jan 27 2020 6:10 PM | Updated on Jan 27 2020 10:06 PM

Karimnagar Municipal Corporation Elections Result - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరుకు ఏ పార్టీ చెక్‌ పెట్టలేకపోయింది. ఇక కరీంనగర్‌లోనూ కారు హవా కొనసాగింది. మొత్తం 60 డివిజన్లకు గానూ 34 డివిజన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో బీజేపీ జెండా పాతింది. అనూహ్యంగా పుంజుకున్న ఎంఐఎం జిల్లాలోని 6 స్థానాల్లో విజయబావుటా ఎగరేసింది. ఇతరులు 8 చోట్ల విజయం సాధించగా, మిగిలిన 6 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఎక్కడా కాంగ్రెస్‌ జాడే కనిపించలేదు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావడంతో మేయర్‌ ఎంపిక గురించి పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. కాగా జిల్లాలో రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరగగా సోమవారం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా మూడో రౌండ్‌లో అభ్యర్థుల గెలుపును ప్రకటించారు.

చదవండి: ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్‌ ఎన్నికలు..

Advertisement
 
Advertisement
Advertisement