కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు.
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్‌కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది.
గురువారం ఉదయం ఈ బృందం గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చేరుకున్నారు. వీరికి స్థానిక ఆర్డీవో స్వాగతం పలికి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.