Earthquake intensity
-
Andhra Pradesh: ఏపీలో వణికించిన భూకంపం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఏపీలో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఇళ్లలో సామాన్లు, బీరువాలు ఊగడాన్ని స్పష్టంగా గుర్తించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ఏపీలో దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో పలుచోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించింది. భూప్రకంపనల కారణంగా తిరువూరు రాజుపేటలోని ఓ గృహంలో గోడలు బీటలు వారాయి. సుందరయ్య కాలనీలోని మోటూరు చింతయ్య ఇంట్లోని సామగ్రి కిందపడిపోయింది. భూకంప కేంద్రం తెలంగాణలోని ములుగు జిలా్లలో ఉండగా.. అక్కడ దాని తీవ్రత 5.3గా నమోదైంది. రాష్ట్రంలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్ల మేర వాయువ్య దిశలో దాని ప్రభావం రిక్టర్ స్కేల్‌పై 2.9గా ఉందని అధికారులు తెలిపారు. ఏపీ సేఫ్ జోన్లోనే..రాష్ట్రంలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇక్కడ వచ్చింది రెండో స్థానమేనని పేర్కొన్నారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని, ఈ స్థాయిలో భూకంపం సంభవిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రకంపనలు ఎక్కడెక్కడ వచ్చాయంటే..విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం, దుద్దుకూరు, దాసియ్యపాలెం, వేలేరుపాడు, రుద్రమకోట, కన్నాయిగుట్ట, కుక్కునూరు మండలం సీతారామనగరం, వేలేరు, శ్రీధర్, ఉప్పేరు, కుక్కునూరు, రాజానగరం, మాధవరం, కొయ్యలగూడెం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, చాట్రాయి మండలం, ఆగిరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, క్రోసూరు తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. -
‘ఈశాన్యాన్ని’ కుదిపేసిన భూకంపం
* 9 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు * మణిపూర్ తదితర రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు * బంగ్లాదేశ్‌లో ఐదుగురు మృత్యువాత * రిక్టర్ స్కేల్‌పై 6.8గా భూకంప తీవ్రత ఇంఫాల్/గువాహటి/ఢాకా: ఈశాన్య, తూర్పు రాష్ట్రాలను సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. మణిపూర్ కేంద్రంగా తెల్లవారుజామున దాదాపు 4:30 గంటలకు సంభవించిన ఈ భూకంపంలో మొత్తం తొమ్మిది మంది మృతిచెందగా (మణిపూర్‌లో ఏడుగురు, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు గుండెపోటుతో మృతి) 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదవగా మణిపూర్‌లోని తమెంగ్లాంగ్ జిల్లాలో 17 కి.మీ లోతున భూకంప కేంద్రం నమోదైంది. ఈ ప్రాంతంలో చాలా భవనాలు కుప్పకూలాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అస్సాం, మిజోరం, త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలతోపాటు పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లో ఐదుగురు మృతిచెందగా దాదాపు 100 మంది గాయపడ్డారు. కేంద్రం సహాయ చర్యల కోసం మణిపూర్, అస్సాంలకు సైనిక, వైమానిక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. అస్సాం పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని సహాయ చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. కాగా, చిత్రం షూటింగ్ కోసం కోల్‌కతాలో ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ‘ట్వీటర్’లో భూకంప వార్తను ట్వీట్ చేశారు. నిద్రిస్తుండగా మంచం ఊగిపోవడంతో ఆశ్చర్యపోయానన్నారు. -
భూకంప జోన్ పరిధిలోనే రాజధాని
- నిర్మాణాలు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి -నేపాల్ అంత తీవ్రత లేకున్నా జాగ్రత్తలు అవసరం - రాజీపడితే భారీ మూల్యం - ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ అధిపతి ప్రదీప్‌కుమార్ హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన ప్రదీప్‌కుమార్‌తో సాక్షి ముచ్చటించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనూ ..... సాక్షి : ఇటీవల ప్రపంచ వ్యాపితంగా భూకంపాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.? ప్రదీప్ : అవును. పర్యావరణ పరిస్థితులు భూకంపాలను సష్టిస్తున్నాయి. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసినా అందుకు తగిన విధంగా నిర్మాణాలు లేకపోవడం వలన నష్టం అధికంగా ఉంటుంది. సాక్షి : నవ్యాంధ్ర రాజధాని కష్ణా తీరం భూకంపాల జోన్లో ఉందా? ప్రదీప్ : కృష్ణా తీరమైన విజయవాడ పరిసరాలన్ని భూకంపాల జోన్-3లో ఉన్నాయి. నూతన రాజధానిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 ఇలా భూకంపాల తీవ్రత కలిగిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటితో పోల్చితే ఇక్కడ అంత భారీ ప్రభావం ఉండదు. సాక్షి : ఇటీవల నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది కదా...? ప్రదీప్ : అవును. అయితే నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన కాశ్మీర్ జోన్-5లో ఉంది. సాక్షి :నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది కాదా. దానిపై భూకంపాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.? ప్రదీప్ : జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగిన టోక్యో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లోనే భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి ఇంజనీరింగ్ విధానాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలి. దానివలన భూకంపాలను ఎదుర్కొనేందుకు అవకాశముంటుంది. సాక్షి : ఏ విధమైన చర్యలు చేపట్టాలి? ప్రదీప్ :అంతర్జాతీయ ప్రమాణాల్లో భాగంగా ఐఎస్1893 (కెరిటెరియ ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రెక్చర్) బుక్ ప్రమాణాలను అనుసరించాలి. అలాగే పీర్‌రివ్యూ కమిటీ నిరంతరం పరిశీలించాలి. ఈ కమిటీ రెండు సంవత్సరాల కొకసారి మారుతుంది. దానివలన నిర్మాణాలను వివిధ రకాలుగా ఆయా రంగాల నిపుణులు పరిశీలిస్తారు. దీనివలన మంచి నిర్మాణాలు వస్తాయి. సాక్షి : భారీ బహుళ అంతస్తుల భవనాలను నమూనాలుగా చూపిస్తున్నారు. వాటిపై భూకంపాల ప్రభావం ఉండదా? ప్రదీప్ : ఆర్కిటెక్చర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా స్ట్రెక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. దాని వలన మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ప్రమాణాల విషయంలో రాజీ పడితే మూల్యం చెల్లించక తప్పదు. -
బిహార్‌లో 15 మంది మృతి
* భారత్‌పైనా భూకంపం ప్రభావం * బిహార్‌లో 15 మంది మృతి * ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఏపీ, తమిళ నాడులోనూ కంపించిన భూమి న్యూఢిల్లీ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో సంభవించిన తాజా భూకంపం భారత్‌పైనా గణనీయంగా ప్రభావం చూపించింది. బిహార్‌లోనే ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారు. బిహార్‌లో ఇంకా దాదాపు పది మంది చనిపోయినట్లు సమాచారం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. అటు దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకూ భూమి కంపించింది. ఢిల్లీలో భూకంప ప్రభావంతో తక్షణమే సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి సిబ్బందిని బయటకు పంపించారు. మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూకంపం ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించి.. అవసరమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టటానికి సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల్లో భూకంప ప్రభావ సమాచారాన్ని సేకరిస్తోందని.. జాతీయ విపత్తు సహాయ దళాన్ని సిద్ధంగా ఉంచిందని ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. విదేశాంగ శాఖ ఢిల్లీ, నేపాల్‌లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25నాటి భూకంపం కారణంగా భారత్‌లో 80 మంది చనిపోగా.. ఒక్క బిహార్‌లోనే 58 మంది మృతిచెందడం విషయం తెలిసిందే. -
నేపాల్ నుంచి ఇంటికి చేరిన కరీంనగర్ జిల్లా వాసులు
కరీంనగర్ (పెద్దపల్లి): కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ మండలం పెద్దపల్లికి చెందిన 55 మంది సురక్షితంగా నేపాల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. వీరంతా సంచారం జీవనం సాగిస్తూ ఉంటారు. అలాగే గత నెలలో నేపాల్‌కు వెళ్లారు. భూకంపంతో విలవిలలాడుతున్న వీరిని భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. గురువారం ఉదయం ఈ బృందం గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు చేరుకున్నారు. వీరికి స్థానిక ఆర్డీవో స్వాగతం పలికి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. -
'కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడవద్దు'
హైదరాబాద్ : భూ ప్రకంపనలపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునామీ హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన భూకంపం సునామీగా మారే అవకాశం లేదని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిన్న భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6 గా పేర్కొంది. -
రాష్ట్రంలో స్వల్ప భూకంపం
-
రాష్ట్రంలో స్వల్ప భూకంపం
భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6గా పేర్కొన్న అధికారులు సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో బుధవారం రాత్రి సంభవించిన స్వల్ప భూకంప ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై పడింది. విశాఖ నగరంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం రాత్రి భూమి కొద్ది సెకెన్ల పాటు తీవ్రంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బుధవారం సుమారు పది సెకెన్ల పాటు తీవ్ర శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, అపార్టమెంట్లలోంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం ప్రాంతాల్లో.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణంతోపాటు జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో భూకంప ప్రభావం కనిపించింది. తిరుపతి, రాజమండ్రిల్లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రతకు పలు ఇళ్లలో సామగ్రి కిందపడిపోయింది. అక్కడక్కడా ఇళ్ల గోడలు బీటలు వారాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్డుపైనే గడిపారు. భారతీయ వాతావరణ శాఖ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 6 గా పేర్కొంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ.. న్యూఢిల్లీ/తైపీ: బుధవారం రాత్రి సంభవించిన ఓ మోస్తరు భూకంపం దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళలకు గురిచేసింది. రాత్రి 9 గంటల 52 నిమిషాలకు బంగాళాఖాతంలో పారాదీప్‌కు తూర్పున 60 కి. మీల దూరంలో 10 కి.మీల అడుగున భూకంపం సంభవించిందని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ వెల్లడించారు. ఢిల్లీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భూకంప ప్రభావం కనిపించింది. చెన్నై, భువనేశ్వర్, కటక్ల్లో భవనాలు కంపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తైవాన్ను కూడా బుధవారం రాత్రి భూకంపం కుదిపేసింది. భూకంపం ప్రభావంతో తైవాన్ రాజధాని తైపీలో భవనాలు ఒక్కసారిగా కంపించాయి. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, 93 మంది మృతి
మనీలా/సెబు: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు.. పెద్ద సంఖ్యలో ఇళ్లు, చర్చిలు, ఇతర భవనాలు కూలిపోయాయి. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకా రం 93 మంది మృతి చెందగా... వందల సంఖ్య లో తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సం ఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు ప్రకటించారు.స్థానిక కాలమానం ప్రకారం 8.12 గంటలకు భూకంపం సంభవించింది. బొహోల్ ద్వీపంలోని కార్మెన్ పట్టణ శివార్లలో భూమికి 33 కి.మీ. దిగువన భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తిం చారు. భారీ భూకంపం అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకూ ఏకంగా 289 చిన్న, పెద్ద ప్రకంపనలు నమోదయ్యాయి. కాడిజ్, సెబు, సిక్విజోర్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. బోల్జూన్తో పాటు పలు ప్రాం తాల్లో కొండ చరియలు విరిగిపడి, వాటి కింద ఇళ్లు కూరుకుపోయాయి.