
బిహార్‌లో 15 మంది మృతి
హిమాలయ రాజ్యం నేపాల్‌లో సంభవించిన తాజా భూకంపం భారత్‌పైనా గణనీయంగా ప్రభావం చూపించింది. బిహార్‌లోనే ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారు.
* భారత్‌పైనా భూకంపం ప్రభావం
* బిహార్‌లో 15 మంది మృతి
* ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఏపీ, తమిళ నాడులోనూ కంపించిన భూమి
న్యూఢిల్లీ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో సంభవించిన తాజా భూకంపం భారత్‌పైనా గణనీయంగా ప్రభావం చూపించింది. బిహార్‌లోనే ఆరుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారు. బిహార్‌లో ఇంకా దాదాపు పది మంది చనిపోయినట్లు సమాచారం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరో 40 మంది గాయపడ్డారు. అటు దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని అస్సాం, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకూ భూమి కంపించింది. ఢిల్లీలో భూకంప ప్రభావంతో తక్షణమే సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి సిబ్బందిని బయటకు పంపించారు. మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూకంపం ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించి.. అవసరమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టటానికి సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల్లో భూకంప ప్రభావ సమాచారాన్ని సేకరిస్తోందని.. జాతీయ విపత్తు సహాయ దళాన్ని సిద్ధంగా ఉంచిందని ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. విదేశాంగ శాఖ ఢిల్లీ, నేపాల్‌లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25నాటి భూకంపం కారణంగా భారత్‌లో 80 మంది చనిపోగా.. ఒక్క బిహార్‌లోనే 58 మంది మృతిచెందడం విషయం తెలిసిందే.