ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు.. పెద్ద సంఖ్యలో ఇళ్లు, చర్చిలు, ఇతర భవనాలు కూలిపోయాయి.
మనీలా/సెబు: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్‌ను మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు.. పెద్ద సంఖ్యలో ఇళ్లు, చర్చిలు, ఇతర భవనాలు కూలిపోయాయి. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకా రం 93 మంది మృతి చెందగా... వందల సంఖ్య లో తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల సం ఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు ప్రకటించారు.స్థానిక కాలమానం ప్రకారం 8.12 గంటలకు భూకంపం సంభవించింది. బొహోల్ ద్వీపంలోని కార్మెన్ పట్టణ శివార్లలో భూమికి 33 కి.మీ. దిగువన భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తిం చారు. భారీ భూకంపం అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకూ ఏకంగా 289 చిన్న, పెద్ద ప్రకంపనలు నమోదయ్యాయి. కాడిజ్, సెబు, సిక్విజోర్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. బోల్‌జూన్‌తో పాటు పలు ప్రాం తాల్లో కొండ చరియలు విరిగిపడి, వాటి కింద ఇళ్లు కూరుకుపోయాయి.