టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కరీంనగర్: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆరోపించారు.
కులవృత్తులను నాశనం చేసిన ఘనత చంద్రబాబుదేనని కమలాకర్ అన్నారు. అదే చంద్రబాబు నేడు బీసీ సీఎం నినాదం అంటూ సరికొత్త కుయుక్తులతో వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లేనని కమలాకర్ సూచించారు.