పుష్కర ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు | kadiyam srihari, indrakaran visits pushkara ghat in eturunagaram | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌ను పరిశీలించిన మంత్రులు

Jul 11 2015 1:26 AM | Updated on Sep 3 2017 5:15 AM

వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఉన్న పుష్కరఘాట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పరిశీలించారు.

ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో ఉన్న పుష్కరఘాట్‌ను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు పరిశీలించారు. శుక్రవారం అక్కడికి చేరుకున్న మంత్రులు పుష్కర ఘాట్ పనులపై ఆరా తీశారు.

రామన్నగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాలమ్మ దేవాస్థానంకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో మంత్రులు పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఘాట్ వద్దకు నీటి మళ్లింపు విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement