దారులన్నీ ‘కొంగర’కే..!

Jogu Ramanna Talk About To Pragathi Nivedana Sabha - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా నుంచి దారులన్నీ కొంగరకలాన్‌ బాటపట్టాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యం లో హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని కొంగరకలాన్‌లో ఆదివారం నిర్వహించే ప్రగతి నివేదన సభకు జనాన్ని భారీగా తరలించేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే సభకు భారీ సంఖ్యలో ప్రజల ను తరలిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగా నాల నేపథ్యంలో పార్టీ నాయకులు పెద్ద మొత్తం లో తరలించేందుకు సిద్ధమయ్యారు.

జనసమీకరణ బాధ్యతలను ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్యనాయకులకు అప్పగిం చారు. కాగా శనివారం కొంతమంది పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరారు. పెద్ద మొత్తంలో మాత్రం ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనాలు, ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్‌ వాహనాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలను భారీగా తరలించనున్నా రు. బస్సులను గ్రామాలకు పంపించి అక్కడి నుంచే జనాన్ని సభకు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. సభకు తరలిస్తున్న జనానికి టీ, టిఫిన్‌తోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాగా శనివారం ఆదిలాబాద్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మోటార్‌సైకిల్‌ ర్యాలీ చేపట్టారు.
 
ఒక్కో నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా..
ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి 10వేలకు పైగా జనాన్ని ప్రగతి నివేదన సభకు తరలించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోథ్, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి మరో 10వేల చొప్పున జనం తరలించేందుకు కసరత్తు చేశారు. ఆదిలాబాద్‌ రూరల్‌ ప్రాంతం నుంచి 30 ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్‌ బస్సు, 18 తుఫాన్‌ వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణం నుంచి 39 ప్రైవేట్‌ బస్సులు ఏర్పాటు చేశారు.

బేల మండలం నుంచి 36 ఆర్టీసీ బస్సులు, 55 తుఫాన్‌ వాహనాలు, జైనథ్‌ మండలం నంచి 39 ఆర్టీసీ బస్సులు, 5 ప్రైవేట్‌ బస్సులు, 41 తుఫాన్‌ వాహనాల్లో జనాన్ని తరలించనున్నారు. మావల మండలం నుంచి 16 ప్రైవేటు బస్సుల్లో జనాలను సభకు తీసుకెళ్లనున్నారు. జనాన్ని బట్టి మరిన్ని వాహనాలను సమకూర్చేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

 అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపూరావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి 9వేల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 10 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేట్‌ బస్సులు, 516 జీపులు సిద్ధం చేశారు. ఉదయం 7గంటలకు తన నివాసం వద్ద నుంచి భీంపూర్, తలమడుగు, తాంసి మండలాల ప్రజలను వాహనాల్లో జెండా ఊపి తరలించనున్నట్లు ఎమ్మెల్యే బాపురావు పేర్కొన్నారు.

ఆ తర్వాత గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్‌హత్నూర్‌ మండలాలకు వెళ్లి వాహనాలను పంపి ప్రజలు, కార్యకర్తలను తరలించనున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గం పరిధిలో 126 ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ బస్సులను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రేఖానాయక్‌ తెలిపారు. 186 జీపులు, కార్ల ద్వారా జనాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉట్నూర్‌ 35 మ్యాక్స్‌లు, 18 బస్సులు, ఇంద్రవెల్లి 28 వాహనాల వరకు సిద్ధం చేశారు. దాదాపు 3వేల వరకు జనాన్ని తరలించనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top