ప్రపంచబ్యాంకు, జేబీఐసీలతో మళ్లీ ఒప్పందాలు! | Japan Bank Signs Deal With World Bank Over Debt | Sakshi
Sakshi News home page

ప్రపంచబ్యాంకు, జేబీఐసీలతో మళ్లీ ఒప్పందాలు!

Aug 5 2014 2:13 AM | Updated on Sep 2 2017 11:22 AM

ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తిరిగి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం ప్రపంచ బ్యాంకు, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తిరిగి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఒప్పందాలు ఉన్నందున, ఆ నిధులన్నీ ఆ రాష్ట్రానికి వెళ్తాయని, అందువల్ల రుణ ఒప్పందాలను రెండు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సోమవారం తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశమయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement