కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి! | jagga reddy join to congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి!

Apr 24 2015 1:30 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి! - Sakshi

కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి!

మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది.

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది. ఈ నెల చివర లేదా వచ్చే నెల మొదటివారంలో ఆయన గాంధీభవన్‌లో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. గత సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు.

సీఎం కేసీఆర్ మెదక్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగ్గారెడ్డి బీజేపీలో ఇమడలేక, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 29న హైదరాబాద్‌కు రానున్నారు. వీలైతే ఆ రోజు జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement