breaking news
Sangareddy constituency
-
కాంగ్రెస్ కంచుకోట సంగారెడ్డి
రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డి నియోజవకర్గంలో విద్యా, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం సంగారెడ్డి పరిసరాల్లో ఉన్న ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌తో పాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. మాజీ స్పీకర్ పి.రామచంద్రారెడ్డి మినహా సుదీర్ఘ కాలం పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మరో నేత ఎవరూ లేకపోవడం ఆసక్తికరం. నాలుగు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించడం విశేషం. 13 ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది మంది నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం విశేషం. సంగారెడ్డిజోన్: 1957లో జరిగిన రెండో శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం ద్వి శాసనసభ నియోజకవర్గంగా అవతరించింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సంగారెడ్డి నియోజకవర్గం పరిధి కుంచించుకు పో యింది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట మండలాలు ఉన్నాయి. 1962 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గంలో 1994 ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి. 1999 ఎన్నికలు మొదలుకుని కాంగ్రెసేతర పక్షాలు సంగారెడ్డి నియోజకవర్గంలో విజయకేతనం ఎగుర వేస్తూ వస్తున్నాయి. 2009 లో మాత్రం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఒక పర్యాయం గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన చింత ప్రభాకర్, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి చింత ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి ఎన్నికల బరిలో నిలవడంతో రాబోయే రోజులో ఉత్కంఠ పోరు సాగనుంది. ఐదు సార్లు గెలిచిన రామచంద్రారెడ్డి.. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పి.రామచంద్రారెడ్డి ఎనిమిది పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసి, ఐదు పర్యాయాలు విజయం సాధించారు. 2004 నాటికి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నరసింహారెడ్డిపై ఓటమి పాలైన పి.రామచంద్రారెడ్డి, తిరిగి 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థి నరసింహారెడ్డి చేతిలో రెండో సారి ఓటమి పొందారు. 1983లో తిరిగి బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనాన్ని తట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తిరిగి 1985లోనూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పట్ల ఉన్న సానుభూతి పవనాలను తట్టుకుని కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలుపొందారు. 1989లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందడంతో మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు, మొత్తం ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన ఘనత సాధించారు. అయితే 1994లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిదో పర్యాయం అసెంబ్లీ బరిలోకి దిగిన రామచంద్రారెడ్డి ఓటమి చెందడంతో నియోజకవర్గ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 1994 తర్వాత కాంగ్రెసేతర పక్షాలదే ఆదిపత్యం 1994 అనంతరం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ఓటమి చెందగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివరెడ్డి విజయం సాధించారు. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఎన్నికల అవగాహనలో భాగంగా సంగారెడ్డి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. బీజేపీ తరపున పోటీ చేసిన కె.సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, అలియాస్ జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌తో విభేదించిన జయప్రకాశ్‌రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా జయప్రకాశ్ రెడ్డి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన చింత ప్రభాకర్ విజయం సా«ధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చింత ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి మరోమారు బరిలో ఉండటంతో ఉత్కంఠ పోరు నెలకొంది. అసెంబ్లీ స్పీకర్‌గా, మంత్రిగా..! 12వ శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించిన రామచంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న మార్పులతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో చేరారు. నేదురమల్లి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్, జనతా, కాంగ్రెస్ ఐ, బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోటములు చవి చూసిన చరిత్ర రామచంద్రారెడ్డికే దక్కింది. తొలి నాళ్లలో ద్విసభ్య నియోజకవర్గం.. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా 1957లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించగా, ద్విసభ్య నియోజకవర్గం కావడంతో జనరల్, రిజర్వుడు స్థానాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జనరల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి కష్ణమాచారి గెలుపొందగా, రిజర్వు స్థానం నుంచి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) తరపున అనంతయ్య విజయం సాధించారు. 1967లో జరిగిన మూడో శాసనసభ ఎన్నికల నాటికి సంగారెడ్డి తిరిగి ఏకసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైంది. నియోజకవర్గంలో ఓటర్లు.. మహిళలు పురుషులు ఇతరులు మొత్తం 1,97,092 1,97,248 36 3,94,376 -
కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి!
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్‌లో చేరడం ఖరారైంది. ఈ నెల చివర లేదా వచ్చే నెల మొదటివారంలో ఆయన గాంధీభవన్‌లో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. గత సాధారణ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. సీఎం కేసీఆర్ మెదక్ లోక్‌సభ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగ్గారెడ్డి బీజేపీలో ఇమడలేక, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ నెల 29న హైదరాబాద్‌కు రానున్నారు. వీలైతే ఆ రోజు జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. -
82,638 మంది యువ ఓటర్లు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ : సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లుండగా వారిలో 83 వేలకుపైగా యువత ఉంది. దీంతో సంగారెడ్డి నియోజకవర్గ బరిలో ఉన్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూ హాలకు పదునుపెడుతున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఇంటర్నెట్, ఫేస్బుక్ ద్వారా అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు చేసుకుంటున్నారు. అలాగే ప్రలోభాలకు తెరతీస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి యు వ ఓటర్లను ప్రధానంగా ఆకట్టుకునేందుకు ప్రచార సీడీలో పవన్‌కల్యాణ్ త నను గురించి ఆసక్తిగా చెప్పిన మాటలను పొందుపర్చారు. టీఆర్ఎస్ సైతం తెలంగాణ వాదం ఆలంబనగా యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అభ్యర్థులు తమదైనశైలిలో యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మ రోవైపు ఎన్నికల సంఘం సైతం యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోమంటూ ప్రోత్సహిస్తోంది. ఓటరు పండుగ పేరిట ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న వారికి బహుమతులు ప్రకటించటంతో పాటు లీటరు పెట్రోలుకు రూ. రూపాయి తగ్గిస్తున్న ట్లు ఆఫర్ ప్రకటించింది. యువ ఓ టర్లు సైతం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన 18 ను ంచి 19 సంవత్సరాల యువ ఓటర్లు సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. -
అడ్డంగా దొరికిపోయిన జగ్గారెడ్డి
-
అడ్డంగా దొరికిన జగ్గారెడ్డి
సెల్ఫోన్లు, కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేస్తూ దొరికిపోయిన వైనం నిషేధిత ప్రాంతంలో అనధికారిక సమావేశం కంటోన్మెంట్ ఎన్నికల స్క్వాడ్ దాడి వెంటనే జారుకున్న నేతలు టీవీ 9 స్టిక్కర్ అంటించిన టవేరా సహా పలు వాహనాలు, మద్యం, ఖరీదైన వస్తువులు స్వాధీనం సమావేశంలో పాల్గొన్న గజ్జెల కాంతం! సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చిక్కుల్లో పడ్డారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సెల్ఫోన్లు, ఖరీదైన వస్తువులు పంచుతూ ఎన్నికల అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సంగారెడ్డి ప్రాంత ప్రజలు, కార్యకర్తలతో ఆయన శనివారం ఇక్కడి గన్‌రాక్ గార్డెన్లో సమావేశమయ్యారన్న సమాచారంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకుంది. ఆ సమయంలో మహిళలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి చర్చిస్తున్నారు. రిటర్నింగ్ అధికారులను గుర్తించిన కార్యకర్తలు, నేతలు ఒక్క ఉదుటన బయటికి లంఘించారు. వీరితో పాటే జగ్గారెడ్డి సైతం బయటికి వెళ్లిపోయారు. వెంటనే గార్డెన్ ప్రధాన ద్వారాన్ని మూసేసిన అధికారులు.. క్షుణ్నంగా తనిఖీలు జరిపి ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసుకున్న పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 80 సెల్ఫోన్లు, సెల్ఫోన్లకు సంబంధించిన సుమారు 600 ఖాళీ డబ్బాలు, ఎనిమిది మైక్రోవేవ్ ఓవెన్లు, 3 డీవీడీలు, 8 గ్యాస్‌స్టౌవ్‌లు, 8 మిక్సీలు, ఖరీదైన ఎనిమిది మద్యం బాటిళ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫంక్షన్ హాల్‌కు సంబంధించిన వంటసామగ్రి, వెజిటబుల్ కట్టర్లు, ప్లాస్టిక్ టీపాయ్‌లు తదితరాలు ఉన్నాయి. టీవీ 9 స్టిక్కర్ అంటించిన (ఏపీ 31 టీయూ 839) టవేరా వాహనంతో పాటు పలు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీపీ మహేందర్, కార్ఖానా, మారేడ్‌పల్లి సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గేటుకు బర్త్‌డే బ్యానర్: గన్‌రాక్ గార్డెన్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు.. గార్డెన్ గేటుకు మాత్రం పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన బ్యానర్ క ట్టారు. తీరా ఎన్నికల అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. బీ-3 కేటగిరీకి చెందిన స్థలంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా అయిన గన్‌రాక్ గార్డెన్‌ను కమర్షియల్ అవసరాలకు వినియోగించడం నిషేధం. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతం రెండు రోజులుగా ఈ గార్డెన్‌లోనే కార్యకర్తలు, నేతలతో మంతనాలు జరుపుతున్నారు. శనివారంనాటి జగ్గారెడ్డి సమావేశంలో కూడా గజ్జెల కాంతం పాల్గొన్నారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ దాడి చేయడానికి కొద్ది క్షణాల ముందు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.