అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ కొలువులకు ఇంటర్వ్యూలు | interviews for agriculture officers and horticulture officers posts | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ కొలువులకు ఇంటర్వ్యూలు

Feb 2 2017 8:36 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఉద్యానవన అధికారుల, వ్యవసాయాధికారుల ఉద్యోగాలకై నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌: ఉద్యానవన అధికారుల, వ్యవసాయాధికారుల ఉద్యోగాలకై నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్‌ సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వ్యవసాయాధికారుల పోస్టుల పరీక్షలో మెరిట్‌ సాధించినవారికి(235మందికి) ఈ నెల 6, 7న, ఉద్యానవనశాఖ పోస్టుల పరీక్షల్లో మెరిట్‌ సాధించినవారికి(151మందికి) 8,10 తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్స్‌ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వ్యవసాయశాఖలో 120 పోస్టులు ఖాళీ ఉండగా.. ఉద్యానవనశాఖలో 75 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి గత ఏడాది(2016) అక్టోబర్‌ 17, 18 తేదీల్లో విభాగాల వారిగా పరీక్ష నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement