46 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులు

Industrial parks in 46 thousand acres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 46 వేల ఎకరాల్లో కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు, ముడిసరుకుల లభ్యత ఆధారంగా వివిధ అనుబంధ రంగ పరిశ్రమలకు ప్రత్యేక పారిశ్రామిక పార్కులను, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

టీఎస్‌ఐఐసీ చేపట్టిన మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళిక అమలుకు 2019 అత్యంత కీలకమని, ఈ ఏడాదిలోనే ఆ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్‌ మెగా ప్రాజెక్టులపై రూపొందించిన 2019 క్యాలెండర్‌ను గురువారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ సీఈవో మధుసూదన్‌తో కలిసి ఆవిష్కరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top