ఇండిగో ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన | Indigo female staffer makes 2 inebriated men touch her feet for misbehaviour | Sakshi
Sakshi News home page

ఇండిగో ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన : కాళ్లు పట్టుకుని క్షమాపణ

Nov 20 2017 4:18 PM | Updated on Nov 21 2017 2:49 AM

Indigo female staffer makes 2 inebriated men touch her feet for misbehaviour - Sakshi - Sakshi - Sakshi - Sakshi

శంషాబాద్‌ : ప్రైవేట్‌ ఎయిర్‌-క్యారియర్‌ ఇండిగో ఉద్యోగినిపై ఐదుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. శనివారం అర్థరాత్రి మద్యం మత్తులో ఉన్న ఆ ఐదుగురు యువకులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఉద్యోగిని ఎయిర్‌పోర్టులో అరైవల్‌ ప్రాంతంలో ఉండగా వీరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అనుచితంగా మాట్లాడారు. వారి ఆగడాలను భరించలేని బాధితురాలు పక్కనే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడంతో సదరు ఉద్యోగిని వారిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేయలేదు. ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీరంతా బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌లకు చెందిన వారిగా గుర్తించారు. ఆ యువకులు రక్షణ శాఖకు ఎలక్ట్రానిక్‌ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్ట్‌‌ ఉద్యోగులని సమాచారం. 

అసభ్యంగా ప్రవర్తించారని కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరమంది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement