దుబాయ్‌లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
దుబాయ్‌లో నిజామాబాద్ వాసి ఆత్మహత్య
Jun 27 2017 4:16 PM | Updated on Aug 1 2018 2:35 PM
బోధన్ : దుబాయ్‌లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని బోధన్ మండలం ఊట్‌పల్లి గ్రామానికి చెందిన గైని శేఖర్(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పనికి సరిపడా వేతనం రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. మూడు నెలల క్రితం శేఖర్ దుబాయ్ వెళ్లాడు. ఈ ఘటనతో ఊట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. శేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement
Advertisement