ఎవుసం పనులు జోరందుకోవాలి | In KCR's Farmhouse: Its Ginger Time | Sakshi
Sakshi News home page

ఎవుసం పనులు జోరందుకోవాలి

Jun 20 2015 4:54 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఎవుసం పనులు జోరందుకోవాలి - Sakshi

ఎవుసం పనులు జోరందుకోవాలి

‘ఎవుసం పనులు జోరుగా సాగాలి.. అల్లం విత్తే పనిని త్వరగా పూర్తి చేయాలి.. ’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్...

* ముఖ్యమంత్రి కేసీఆర్
* వ్యవసాయ క్షేత్రంలో పంటల పరిశీలన

జగదేవ్‌పూర్: ‘ఎవుసం పనులు జోరుగా సాగాలి.. అల్లం విత్తే పనిని త్వరగా పూర్తి చేయాలి.. ’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ సూపర్‌వైజర్‌కు సూచించినట్లు తెలిసింది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకొని ఫాంహౌస్‌కు చేరుకున్న విషయం విదితమే. శుక్రవారం ఉదయం భవనంపైకి ఎక్కి వ్యవసాయక్షేత్రంలోని పంటలను పరిశీలించారు. నాలుగు దిక్కులా చూస్తూ ఎక్కడ ఏ పంటలు సాగు చేయాలో బాధ్యులకు సూచించినట్లు తెలిసింది.

ముఖ్యంగా ఫాంహౌస్ కుడి వైపు భూమిలో అల్లం విత్తే పనిని తొందరగా పూర్తి చేయాలని సూచించారు. ఖరీఫ్ సాగు పనులు జోరుగా సాగించాలని, బావి పనులను కూడా తొందరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిసింది. క్యాప్సికమ్ పంట సాగు చేసే భూమిని ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే డ్రిఫ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గంట పాటు భవనంపై నుంచే వ్యవసాయం పనులను పర్యవేక్షించారు.
 
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి..
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్.. కలెక్టర్ రాహుల్‌బొజ్జాకు సూచించినట్టు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement