3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు | IMD forecasts rains for three days with thunderstorm in telangana | Sakshi
Sakshi News home page

3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

May 1 2017 1:27 AM | Updated on Sep 5 2017 10:04 AM

3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా బాద్‌ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతాయని వెల్లడిం చింది. గత 24 గంటల్లో కల్వకుర్తి, హైద రాబాద్‌ గోల్కొండల్లో ఒక సెంటీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement